నాటా మహాసభల్లో నరాల రామారెడ్డి అష్టావధానం
నాటా తెలుగు ఉత్సవాల్లో భాగంగా జులై 8వ తేది ఉదయం 9 గంటలకు నరాల రామారెడ్డి అష్టావధానం చేయనున్నారు. నరాల రామారెడ్డి గత 52 ఏళ్లుగా దాదాపు వెయ్యి అవధానాలు చేశారు. అమెరికా తెలుగు సంఘాలైన ఆటా, నాటా, తానా ఆహ్వానాలను అందుకొని అమెరికాలో పలుమార్లు అవధానం చేసి మన్ననలందుకున్నారు. జూలై 6,7,8న ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా తెలుగు ఉత్సవాలలో నరాల రామారెడ్డి మరోసారి అష్టవధానం చేయనున్నారు. ఈ అవధాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరై విజయవంతం చేయాలని నాటా కన్వెన్షన్ 2018 లిటరరీ కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి కోరారు.













