కేన్సర్‌ను కనిపెట్టే సూక్ష్మ అణువులు
కాంతి ఉద్గార సూక్ష్మ అణువులతో కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించవచ్చట. చిన్న చిన్న కేన్సర్ కణితులను, అది విస్తరిస్తున్న తీరును పసిగట్టే ప్రభావవంత విధానాన్ని అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎమ్మారై స్కానింగ్ కంటే ఈ విధానం మెరుగ్గా పనిచేస్తుందట. ఎలుకల శరీరంలోకి కాంతిని విడుదల చేసే సూక్ష్మ అణువులను చొప్పించి మెక్రోస్కోపిక్ ఆప్టికల్ పరికరంతో పరీక్షించగా ఎముకల్లో అధివృక్క గ్రంధిలో చిన్న చిన్న కణితులను సైతం గుర్తించ గలిగామని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన భారత సంతతి శాస్త్రవేత్త విద్యా గణపతి తెలిపారు.













