మరో వివాదంలో అమెరికా స్పీకర్ పెలోసీ
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్, డెమోక్రటిక్ పార్టీ ముఖ్య నాయకురాలు నాన్సీ పెలోసీ సెలూన్ (క్షవరశాల) వివాదంలో చిక్కుకున్నారు శాన్‌ఫ్రానిస్కోలో ఆమె ఇటీవల తమ ఇంటి పక్కనే ఉన్న సెలూన్ నుంచి హెయిర్ స్టెలిస్ట్ ను తన ఇంటికి పిలిపించుకుని మేకప్ చేయించుకున్నారు. కరోనా కారణంగా ఇలా ఇండ్లకు వెళ్లి సేవలు అందించటాన్ని నగరంలో నిషేధించినప్పటికీ సెలూన్ సిబ్బంది నిబంధనలు అతిక్రమించి సేవలు అందించారు. నాన్సీ పెలోసీ ముఖానికి మాస్కులేకుండా ఒక హెయిర్ స్టైలిస్టును వెంటబెట్టుకొని తన ఇంటికి వెళ్తున్న వీడియో ప్రసారం కావడంతో అమెరికా దూమారం రేగుతున్నది. అయితే. ఇదంతా ఎన్నికల వేళ తన ప్రతిష్ఠను దెబ్బతీయటానికి జరిగిన కుట్ర అని, సెలూన్ తనకు క్షమాపణ చెప్పాలని పెలోసీ డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ప్రత్యర్థులు మాత్రం ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు.













