NATS: నాట్స్ కాన్ఫరెన్స్‌లో జోష్ నింపిన దేవిశ్రీ ప్రసాద్ అండ్ టీం
నాట్స్ (NATS) 8వ కాన్ఫరెన్స్‌లో రెండో రోజు మ్యూజికల్ నైట్ అదిరిపోయేలా జరిగింది. ‘రాక్‌స్టార్’ దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) తన ఆటపాటలతో అందర్నీ అలరించారు. డీఎస్పీ సోదరుడు సాగర్, రంజిత్, సహా ఇతర గాయకులు కూడా తమ పాటలతో అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం పాటలపై తన ఆలోచనలు దేవీశ్రీ ప్రసాద్ పంచుకున్న వీడియోను ప్రదర్శించారు. అది ముగిసిన వెంటనే ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్‌తో స్టేజి మీదకు వచ్చిన డీఎస్పీ.. పుష్ప బీజీఎంకు డ్యాన్స్ వేసి అలరించారు. నాట్స్ వేదికపై పెర్ఫామెన్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నానని డీఎస్పీ అన్నారు. అనంతరం జల్సా టైటిల్ సాంగ్ సహా పలు పాపులర్ పాటలకు ఆడి, పాడి అందర్నీ ఆనందంలో ముంచెత్తారు.







