TANA: తానా మహాసభల్లో మీ బిజినెస్…విజయవంతం
డిట్రాయిట్‌లోని నోవైలో జరగనున్న తానా (TANA) 24వ మహాసభలను పురస్కరించుకుని హైదరాబాద్ (Hyderabad)లోని దస్ పల్లా హోటల్లో ఏర్పాటు చేసిన ది అపర్చునిటీస్ తానా పేరుతో మల్టిఫుల్ బిజినెస్ వర్గాలతో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది.
హైదరాబాద్‌లోనూ, ఇండియాలోనూ ఉన్న మల్టిఫుల్ బిజనెస్ వర్గాలు అంటే రియల్ ఎస్టేట్, జ్యువెల్లరీస్, బొటిక్ బిజినెస్ చేస్తున్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా మహాసభల్లో స్టాల్ట్స్ పెట్టడం వల్ల కలిగే లాభాలను ఈ సందర్భంగా తానా నాయకులు వివరించారు. అలాగే స్టాల్స్‌లో పెట్టడం, ఇతర విషయాలపై బిజినెస్ వర్గాలు వెలిబుచ్చిన ప్రశ్నలను, సందేహాలను తానా నాయకులు పరిశీలించి దీనికి తగిన పరిష్కారాన్ని తానా నాయకులు వారికి తెలియజేయనున్నారు.
ఈ కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ నుంచి 25 నుంచి 30 మంది, జ్యూవెల్లరీ బిజినెస్ నుంచి 5,10 మందిదాకా, బొటిక్ బిజనెస్ వర్గం నుంచి 5 నుంచి 10 మంది దాకా హాజరయ్యారు.
తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, సతీష్ వేమన, తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, బోర్డ్ సభ్యురాలు లక్ష్మీదేవినేనితోపాటు, చందు గొర్రె పాటి, తానా శ్రేయోభిలాషులు బానుమూర్తిగారు, సుబ్బారావుగారు తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఏరోవిల్లాస్ సంస్థ స్పాన్సర్ చేసింది. మహాసభలకు మెయిన్ స్పాన్సర్‌గా ఉండటానికి వాళ్లు ముందుకు రావడం పట్ల తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.







