ముకేశ్ అంబానీకి అరుదైన గౌరవం
ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నులలో ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. ఈ భారతీయ కుబేరుడి సంపద విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు విడుదలైన తాజా జాబితాలో ఫోర్బ్స్ పేర్కొన్నది. గతేడాది 40.1 బిలియన్ డాలర్లతో 19వ స్థానంలో ఉన్నారు. ఇదిలావుంటే అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ 1,349వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొన్నది. ఇక జాబితాలో మొత్తం 106 మంది భారతీయులకు చోటు దక్కగా, ముకేశ్ అంబానీ ఎప్పట్లాగే టాప్లో నిలిచారు. కాగా, ప్రపంచ స్థాయిలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 131 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోల్చితే 19 బిలియన్ డాలర్లు పెరిగింది. రెండో స్థానంలో బిల్గేట్స్, మూడో స్థానంలో వారెన్ బఫెట్ ఉండగా, ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు.













