సన్నీవేల్లో ఘనంగా ప్రారంభమైన ‘మిస్టర్ బిర్యానీ’
అమెరికాలో ఉన్న ముఖ్యంగా సన్నివేల్‌లో ఉన్న బిర్యానీ ప్రియుల కోసం, వారు కోరుకున్న రుచులకు అనుగుణంగా అందించేందుకు వీలుగా ‘మిస్టర్ బిర్యానీ’ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. నవంబరు 11వ తేదీన మిస్టర్ బిర్యానీ రెస్టారెంట్‌ను తెలుగు ప్రముఖులు, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి ప్రారంభించారు. కస్టమర్ల రుచులకు అనుగుణంగా అమెరికాలో వివిధ చోట్ల పలు రెస్టారెంట్లను ఏర్పాటు చేసిన ప్రసిద్ధిపొందిన వ్యాపారవేత్తలు కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ మిస్టర్ బిర్యానీ కూడా ఏర్పాటైంది. తెలుగు వారి సంప్రదాయ రుచులను మరింత చేరువ చేయాలనే తలంపుతో భీమవరం రుచులు రెస్టారెంట్‌ను బావార్చి శ్రీకాంత్ దొడ్డపనేనితో కలిసి వారు ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఆంధ్ర సంప్రదాయంతో కిచెన్ నుంచి వడ్డన వరకు ప్రత్యేకతలను చాటుకున్నారు. ఇటీవల కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో అంబుర్ బిర్యానీజ్ పేరుతో అతిపెద్ద రెస్టారెంట్‌ను ప్రారంభించి, దిగ్విజయంగా నడుపుతున్నారు. తమ రెస్టారెంట్లకు వచ్చిన రెస్పాన్స్, ఆహార ప్రియుల ఆదరణతో ఇప్పుడు మరో రెస్టారెంట్‌కు శ్రీకారం చుట్టి సన్నివేల్‌లో తమ రెస్టారెంట్‌గా మిస్టర్ బిర్యానీని ప్రారంభించారు. చికెన్, మటన్ బిర్యానీలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్ బిర్యానీని కూడా విభిన్న రుచులతో ఇక్కడ అందిస్తున్నారు. ధమ్ బిర్యానీ తో సహా అనేక రకాల బిర్యానీలను బాస్మతీ రైస్‌తో సిద్ధం చేసిన బిర్యానీని తినేందుకు ఎంతోమంది ఎందురు చూస్తుంటారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో లక్ష్మణ్ పరుచూరి, సతీష్ బోళ్ల, తిరుపతి రావు సతీ సమేతంగా పాల్గొన్నారు. స్థానిక ప్రముఖులు ప్రొఫెసర్ ఆంజనేయులు కొత్తపల్లి, రమేష్ తంగిళ్లపల్లి, శశి దొప్పలపూడి, మోహన్, విజయ్, వెంకట్ కోగంటి, గోకుల్ రాచిరాజు, భారత్ ముప్పురాళ్ల, బెజవాడ శ్రీను, సందీప్ ఇంటూరి, ఓమ్ ఇన్సూరెన్స్ అధినేత్రి అను ఆలిశెట్టి, హైమా రెడ్డి అనుమాండ్ల తదితరులతోపాటు పలువురు తెలుగువాళ్ళు కూడా పాల్గొన్నారు.













