రాలీ, ఉత్తర కరోలినా ప్రవాసులతో ఎంపీ రఘురామరాజు సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాడి ఈ నీరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న నర్సాపూర్ ఎంపీ రఘురామరాజు గారు ఉత్తర కరోలినాలోని రాలేలోనీ స్థానిక టీడీపీ కార్యవర్గం, కార్యకర్తల మరియు సన్నిహితుల ఆత్మీయ సమావేశంలో కోరారు. గొట్టిపాటి శ్రీధర్ గారు మరియు అవనీంద్ర ప్రసాద్ నాగినేని గారు ఈ సమావేశాన్ని సమన్వయపరిచారు. ఈ సమావేశం విజయవంతం కావడంలో NRI టీడీపీ RTP కార్యవర్గ సభ్యుల శ్రీనివాస్ ఆరెమండ, రాజీవ్ తలసీల, నాగరాజు గోంది, సురేష్ చల్లపల్లి, శ్రీనాథ్ కడియాల మరియు రాలీ ఎన్టీఆర్ ఫాన్స్ & టీడీపీ కార్యకర్తలు శ్రీనివాస్ మార్తల, శ్రీని అనంత, శిరీష్ గొట్టిముక్కల, హరీష్ కన్నెగంటి, ప్రవీణ్ పెద్ది, కృష్ణ రెడ్డి గంగిరెడ్డి, శరత్ కొమ్మెనేని, అనిల్ మద్దినేని, రమేష్ గంధమనేని, వీరు గన్నే, చౌదరి అడుసుమల్లి, అవినాష్ గోగినేని, వెంకట్ అవిర్నేని, కిశోరె కాట్రగడ్డ, ప్రశాంత్ కాట్రగడ్డ, సతీష్ సూరపనేని, బుజ్జి గారు, శ్రీ కొండపనేని, శ్రీకాంత్ యర్రగుంట, రవి వాసిరెడ్డి, శ్రీహరి కాకోళ్ళు, బాలకృష్ణ తుమ్మల, రాజేష్ ముమ్మనేని తదితరులు కీలక పాత్ర పోషించారు.













