మహాత్మాగాంధీకి అమెరికా అత్యున్నత పౌర పుసర్కారం!
మహాత్మాగాంధీకి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం బహుకరించే అవకాశం ఉంది. శాంతి, అహింస కోసం కృషి చేసినందుకు కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఆ దేశ చట్టసభ సభ్యులు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. న్యూయార్క్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యురాలు కరోలినా మలోనేతో పాటు భారత సంతతికి చెందిన నలుగురు అమెరికా చట్టసభ సభ్యులు అమీబేరా, రాజాకృష్ణ మూర్తి, రోఖన్నా, ప్రమీలా జయపాల్ ఈ ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానాన్ని తులసి గబ్బర్డ్ మద్దతు ప్రకటించారు. తీర్మానం ఆమోదం కోసం ఆన్ ఫైనాన్షియల్ సర్వీస్, కమిటీ ఆన్ హౌజ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపించారు. అమెరికా కాంగ్రెస్ ఇచ్చే ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇప్పటివరకు కొద్ది మంది విదేశీయులే అందుకున్నారు. వారిలో మదర్ థెరీసా, నెల్సన్ మండేలా, పోప్ జాన్ పాల్-2, దలైలామా, అంగ్ సాన్ సూకీ తదితరులు ఉన్నారు.













