నాకు న్యాయం కావాలి : ఫ్లాయిడ్ భార్య
జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత ఆయన మాజీ భార్య రోక్సీ వాషింగ్టన్ తన ఆరేండ్ల కుమార్తె జియానాతో కలిసి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ప్లాయిడ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫ్లాయిడ్ మంచి తండ్రి అని, పోలీసుల కర్కశత్వానికి అతడు బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇంటికి వెళ్లి వారి కుటుంబంతో కలిసి ఉంటారు. కానీ, జియానాకు తండ్రి లేడు. జియానా ఎదుగుదలను, ఉన్నత విద్యను అతడు చూడలేదు అంటూ వాపోయారు. ఆయనకు న్యాయం చేయాలి. ఎందకంటే ఆయన చాలా మంచివారు అని పేర్కొన్నారు. ఫ్లాయిడ్ మరణానికి కారణమైన నలుగురు పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేశారు.













