యూరోప్ నుంచే న్యూయార్క్ కు వైరస్
అమెరికాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల సుమారు 14వేల మంది చనిపోయారు. అయితే ఆ వైరస్ ప్రధానంగా యూరోప్ నుంచి న్యూయార్క్‌కు వ్యాపించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం రాసింది. ఫిబ్రవరి నెలలోనే వైరస్ న్యూయార్క్‌కు చేరుకున్నట్లు జన్యు విశ్లేషణ ద్వారా ఓ అంచనాకు వచ్చారు. యూరోప్ నుంచి వచ్చే ప్రయాణికులే అమెరికా కరోనా వైరస్‌ను మోసుకువచ్చినట్లు ఇచాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పనిచేస్తున్న జన్యుశాస్త్రవేత్త హార్మ్ వాన్ బాకెల్ తెలిపారు. ఆ వర్సిటీ తమ స్టడీ పేపర్లో ఈ విషయాన్ని చెప్పింది.













