అమెరికాలోని పాఠశాలల్లో విరామ సమయంలో ధ్యానం
అమెరికాలోని పాఠశాలల విద్యార్థుల్లో ఒత్తిడి, భావోద్వేగాలను తగ్గించడానికి యోగా, ధ్యానం వ్యాయామాలను ప్రవేశపెడుతున్నాయి. విద్యార్థుల మానసిక స్థితిని గాడిన పెట్టడానికి అక్కడి ఉపాధ్యాయులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొవిడ్ 19 తర్వాత విద్యార్థుల ఆరోగ్య స్థితిలో మార్పులు వచ్చాయని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెల్చింది. యోగాతో వారి మానసిక స్థితి మెరుగుపడుతుందని పరిశోధనలో తెలింది. 2023 సీడీసీ నివేదిక ప్రకారం విద్యార్థులు అనేక విషయాలకు ప్రభావితం అవుతున్నారని పేర్కొంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా పాఠశాలలో మైండ్పుల్నెస్ (యోగా, ధ్యానం)ను ఉపయోగించాలని తెలిపింది.







