అమెరికాకు మాంద్యం ముప్పు
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యానికి చేరువులో ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. ది నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనమిస్ట్స్ నిర్వహించిన సర్వే ప్రకారం మరో రెండేళ్లలో అమెరికాలో ఆర్థికమాంద్యం రావచ్చని మెజారిటీ నిపుణులు. పాలసీ పోల్లో ద్రవ్య పరపతి విధాన సమీక్షలో మార్పుల కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం రావొచ్చని అభిప్రాయపడ్డారు. ది నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనమిస్ట్స్ మొత్తం 226 మంది ఆర్థికవేత్తలను ప్రశ్నించగా ఈ ఏడాది నుంచి ఆర్థిక మాంద్యం మొదలవుతుందని రెండుశాతం మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడగా.. 2020 లేదా 2021లో అమెరికాలో ఆర్థిక మాంద్యం రావొచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.













