విశ్వహిందూ సమ్మేళనంలో ఉప రాష్ట్రపతి, భాగవత్ ప్రసంగం
షికాగో గడ్డపై వివేకానందుడు హిందూ మత ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అదే నగరం వేదికగా మరో ప్రతిష్ఠాత్మక సదస్సు జరుగనుంది. 7-9 తేదీల్లో విశ్వహిందూ ఫౌండేషన్ అక్కడ రెండో విశ్వ హిందూ సమ్మేళనం నిర్వహించనుంది. ఈ సదస్సులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2300 మంది ప్రతినిధులు దీనికి హాజరుకానున్నారు. షికాగో వేదికగా ప్రసంగించనున్న రెండో భారతీయుడు భాగవత్ కావడం విశేషం.
షికాగో వేదికగా ఉప రాష్ట్రపతి ప్రసంగం
తన అద్భుత ప్రసంగంతో నాడు స్వామి వివేకానంద యావత్ ప్రపంచాన్నీ ఎక్కడైతే ఆకర్షించారో, అదే షికాగోలో ఈ నెల నిర్వహించే కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కీలకోపన్యాసం చేయనున్నారు. వివేకానందుడి ప్రసంగ స్మారకార్థం 7 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనబంద సంస్థ ప్రపంచ హిందూ కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా హాజరు కానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల అనుసంధానానికి ఇదో వేదిక కానున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పరస్పరం స్ఫూర్తిదాయకంగా ఆలోచనలు పంచుకోవడం, వివేకానందుడి బోధనల సత్ప్రభావాన్ని వివరించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.













