ఆరోగ్య సమస్యలను గుర్తించే రోబో
ఆరోగ్య సమస్యలను గుర్తించే కణంలా ఉండే చిన్నపాటి రోబోను మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది మానవ అండం పరిమాణంలో ఉంటుంది. ఇందులో ద్వి డైమన్షియల్ మెటీరియల్తో కూడిన సన్నపాటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంటుంది. దీనినే కొల్లాయిడ్స్ అని కూడా అంటారు. ఇతర పదార్థాలు వెళ్లలేని ప్రాంతాల్లోకి కూడా ఇది ప్రయాణించి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంది. ఇది జీర్ణ క్రియ నుంచి ప్రయాణిస్తూ, మంటకు కారణం అవుతున్న అంశాలను, రోగ కారకానలు గుర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.













