యూజీ విద్యార్థులకు మిస్సోరీ వర్శిటీ ప్రత్యేక ప్రోగ్రామ్స్
అమెరికాలోని మిస్సోరీ స్టేట్ యూనివర్శిటీ భారత అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల కో-ఆపరేటివ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అందిస్తామని వెల్లడించింది. విద్యార్థులకు నాలెడ్జ్, స్కిల్స్, ఎబిలిటీస్ లక్ష్యంగా దీన్ని రూపకల్పన చేశామని వర్శిటీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ బ్రాడ్ బౌడెన్హుసేన్ వెల్లడించారు. ఇందులో చేరే విద్యార్థులకు స్కాలర్షిప్లను కూడా మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.













