హరితహారంలో మాజీ మిస్ వరల్డ్
నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో నారాయణపురం, గంగమూల తండా, వాచ్చ తండా, కడపగండి తండాలలో హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించారు. మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ మిస్ వరల్డ్ ఎస్మా వెల్డర్ విచ్చేసి ఎంపిపి గుత్తా ఉమాదేవి, జెడ్పిటిసి వీరమల్ల భాను, సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరితో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో ఎస్మా వెల్డర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జెలందర్రెడ్డి, ఈవోపిఆర్డీ మల్సూర్ నాయక్, కట్టెల భిక్షపతి, కొర్ర సుని,త వాంకుడోతు దేవీలాల్, కరంటోతు సాల, ఎంపిటీసీలు బచ్చనగోని గాలయ్య, ఈసం యాదయ్య, రజిత, ఎపీవో ప్రశాంతి, ఎసిపి సత్తయ్య, సిఐ పార్థసారధి, ఎస్ఐ నాగారాజు, నాయకులు వీరమల్ల వెంకటేశం, గుత్తా ప్రేమ్చందర్రెడ్డి పాల్గొన్నారు.













