మిస్ ఇండియా వరల్డ్‌వైడ్‌గా శ్రీసైనీ
ప్రవాస భారతీయ యువతి శ్రీ సైనీకి (22) మిస్ ఇండియి వరల్డ్‌వైడ్ కిరీటం దక్కింది. ఈ విషయాన్ని పోటీలు నిర్వహించిన ఇండియా ఫెస్టివల్ కమిటీ (ఐఎఫ్‌సీ) పేర్కొంది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్హా, బ్రిటన్‌కు చెందిన అనూషా సరీన్ మొదటి, రెండో రన్నర్ అప్స్‌గా ఎంపికయ్యారు. శ్రీ సైనీకి 12 ఏండ్ల వయస్సులోనే గుండె చికిత్స జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా డ్యాన్స్ చేయవద్దని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె మనోనిబ్బరం కోల్పోలేదు. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు శ్రీసైనీ తెలిపారు. వచ్చే ఏడాది ముంబయిలో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీలు నిర్వహించనున్నట్టు ఐఎఫ్‌సీ చైర్మన్ ధర్మాతా సరన్ తెలిపారు.













