కరణం మల్లీశ్వరి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు గోల్డ్ మెడల్
ఇండియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను సంచలనం సృష్టించింది. 22 ఏళ్ల తర్వాత వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించిపెట్టింది. మహిళల 48 కేజీల కేటగిరీలో పోటీ పడిన చాను, స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీల బరువెత్తి మొత్తంగా 194 కేజీలతో నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. రియో ఒలింపిక్స్‌లో ఘోరంగా విఫలమైన చాను, ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌లో సత్తా చాటింది. ఈ మెగా ఈవెంట్లో చివరిసారి 1994, 1995లో వరుసగా రెండుసార్లు కరణం మల్లీశ్వరి రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. అమెరికాలోని అనాహీమ్లో ఈ ఈవెంట్ జరుగుతున్నది. చాను తర్వాత 193 కేజీలతో థాయ్‌లాండ్‌కు చెందిన సుక్చరియోన్ తున్యా సిల్వర్ మెడల్, 182 కేజీలతో సెగురా అనా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. డోపింగ్ ఆరోపణలతో రష్యా, చైనా, ఉక్రెయిన్, అజర్బైజాన్లాంటి దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొనడం లేదు.













