నల్లజాతీయుడిపై పోలీసుల అనమానుషం
అమెరికాలోని మిన్నియాపోలిస్‌లో ఓ నల్లజాతీయుడి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఓ రెస్టారెంట్లో సెక్యూరిటీ గార్గుగా పని చేసే జార్జ్ ఫ్లెడ్పై ఒక కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు కిందపడేసి చేతికి సంకెళ్లు వేశారు. ఇంతలో ఓ పోలీసు అధికారి జార్జ్ గొంతుపై మోకాలితో బలంగా నొక్కిపెట్టాడు. అతడు ఎంత ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు. కొంతసేపటికి జార్జ్‌లో చలనం లేకపోవడంతో అతడు చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో విస్త•తంగా ప్రచారమయ్యాయి. ఈ అమానుషాన్ని ఖండిస్తూ శ్వేత, నల్లజాతీయులు నిరసన చేపట్టి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. నలుగురు పోలీసులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మేయర్ జాకబ్ ఫ్రే చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.













