భారతీయుల సమాచారం తెలుసుకుంటున్నాం
హరికేన్ ఇర్మా ధాటికి విలవిల్లాడుతున్న అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని భారతీయుల క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. అమెరికా, వెనిజులా, ఫ్రాన్స్ నెదర్లాండ్స్‌లో ఇర్మా తన ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ వరుస ట్వీట్ల ద్వారా అక్కడి పరిస్థితిని తెలియజేశారు. నాలుగు దేశాల్లో ఉన్న స్థానిక ప్రభుత్వాలు, భారత దౌత్యకార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నాం. అక్కడున్న భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలియజేశాం అని ఆయన ట్వీట్ చేశారు.













