ఎన్నారైల సంక్షేమానికి టీడిపి కృషి – గంటా
డల్లాస్లో మొదటిసారిగా ఎన్నారై తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానాడులో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నారైల సంక్షేమంకోసం కృషి చేస్తూనే వారిని మాతృరాష్ట్రంతో సన్నిహితం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ తరగతుల ఏర్పాటు వంటి కార్యక్రమాలతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నారైలు కీలకపాత్ర పోషిస్తున్నారని మంత్రి గంటా కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలన్నింటిని నెరవేర్చిందన్నారు. మీరంతా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని మంత్రి గంటా కోరారు.













