యూఎస్ లోని రైట్ స్టేట్ వర్సిటీ డైరెక్టర్లతో మంత్రి గంటా భేటీ…
ఒహియోలోని రైట్స్టేట్ వర్సిటీ డైరెక్టర్లతో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఫీజురాయితీ విషయంపై ఆయన సమవేశమయ్యారు. తుది ఒప్పందం పత్రాలను మంత్రి గంటాకు వర్సిటీ అధ్యక్షుడు షెరాల్ షెడర్ అందజేశారు. ఈ సందర్భంగా షెడర్ మాట్లాడుతూ ఒక రాష్ట్రంతో నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి అని అన్నారు. గ్రాడ్యుయేష్, అండర్ గ్రాడ్యుయేష్, పీహెచ్డీ కోర్సులకు ఫీజులో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.డిసెంబర్లో ఏపీకి వర్సిటీ ఒప్పందం వస్తుందన్నారు. ఏపీ విద్యార్థులు ప్రత్యేకంగా వర్సిటీ వైబ్సైట్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందన్నారు.













