సిన్సినాటి విశ్వవిద్యాలయంలో గంటా బృందం
అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒహియోలోని సిన్సినాటి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సిన్సినాటీ వర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇతర అధికారులతో సమావేశమై నవ్యాంధ్రలో ఫ్యాక్టలీ ప్రోగ్రాంపై చర్చించారు. వర్సిటీలోని బోధనా పద్ధతులను పరిశీలించారు. నవంబరు మూడో వారంలో రాష్ట్రాన్ని సందర్శిస్తామని ఈ సంద్భంగా సిన్సినాటి వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆ పర్యటనలో అధ్యాపకులకు శిక్షణకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఫ్రాంక్లిన్ యూనివర్సిటీని కూడా సందర్శించిన గంటా బృందం వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ క్రిష్టఫర్ ఆన్లైన్ కోర్సులపై చర్చించారు. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఏపీలో పర్యటిస్తామని ఫ్రాంక్లిన్ వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం ఆన్లైన్ కోర్సులపై ఎంవోయూ కుదుర్చుకోనున్నారు.













