అమెరికాలో కుప్పకూలిన సైనిక విమానం
దక్షిణ అమెరికాలోని రక్షణ రంగానికి చెందిన కార్గో విమానం జార్జియాలో కూలడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సిటీ ఆఫ్ సవన్నా సమీపంలోని విమానాశ్రయంపై హైవేపై ఈ విమానం కూలిందని, జార్జియా నేషనల్ గార్డ్ ప్రతినిధి డిసిరీ బంబా వెల్లడించారు. ఈ విమానం సి- 130 రకానికి చెందిన విమానమని, ప్యూర్టో రికో నేషనల్ గార్డ్ టీమ్ ఈ విమానం సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని, వారి వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని అధికారి పేర్కొన్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. మంటలు చెలరేగడంతో విమానం మొత్తం మండిపోయి పెద్ద ఎత్తున పొగలు వెలువడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.













