మళ్లీ బరిలోకి మైక్ టైసన్
మాజీ హెవీ వెయిట్ బాక్సర్ మైక్ టైసన్ మళ్లీ రంగ్లోకి దిగనున్నాడు. కరోనా బాధితులను ఆదుకోవడం కోసం 53 ఏళ్ల మైక్ మళ్లీ రింగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. చారిటీ మ్యాచ్‌ల్లో ఆడి విరాళాలు సేకరించాలనుకుంటున్నానని టైసన్ తెలిపారు. టైసన్ ప్రత్యర్థులుగా బిల్ విలియమ్స్ (న్యూజిలాండ్), పాల్ గాలెన్ (ఆస్ట్రేలియా)లో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. 2005లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన టైసన్.. అప్పటి నుంచి మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టలేదు. కరోనా బాధితుల సహాయార్థం విరాళాలు అందించే వారి కోసం కూడా మైక్.. తాను ఆటోగ్రాఫ్ చసిన బాక్సింగ్ గ్లౌజ్‌లను బహుమతిగా అందించనున్నాడు. కనీసం రూ. 2 వేలు విరాళంగా ఇచ్చే వారి నుంచి లాటరీగా గ్లౌజల విజేతలను ఎంపిక చేయనున్నాడు.













