రికార్డు సృష్టించిన ఒబామా దంపతులు
ఒబామా దంపతులు అరుదైన ఘనత సాధించారు. గౌరవనీయమైన వ్యక్తులుగా ఇద్దరూ మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు. ఓ సర్వే సంస్థ విడుదల చేసిన జాబితాలో వీరిద్దరికీ మొదటి స్థానం లభించింది. అత్యంత గౌరవనీయమైన పురుషునిగా మాజీ అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా తొలి స్థానంలో నిలిచారు. ఒబామా భార్య మెషెల్లీ ఒబామా గౌరవనీయ మహిళగా మొదటి స్థానంలో ఉన్నారు. ఒబామా 11 ఏళ్ల నుంచి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. కాగా మెషెల్లికి అత్యంత గౌరవనీయ మహిళగా మొదటి స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. హిల్లరీ క్లింటన్‌ను వెనక్కి నెట్టి మిషెల్లీ మొదటి స్థానం సాంపాదించింది.
గల్లప్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే 2018 సంవత్సరానికి గానూ అత్యంత గౌరవనీయ పురుషుల, మహిళల జాబితాలను గల్లప్ వెల్లడించింది. ఇందులో ఒబామా, మిషెల్లీ భార్యభర్తలిద్దరూ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. కాగా హిల్లరీ క్లింటన్‌కు ఈ జాబితాలో మూడవ స్థానం దక్కింది. మెలానియా ట్రంప్‌తో ఆమె సరిసమాన స్థానంలో కొనసాగుతున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 టాప్5లో చోటు సంపాదించారు.













