సంచలన వ్యాఖ్యలు చేసిన మిషెల్ ఒబామా
అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మిషెల్ కొలొరోడోలోని విమెన్స్ ఫౌండేషన్ లో 8,000 మంది మహిళల ముందు ప్రసంగం ఇచ్చారు. 2016 అధ్యక్ష ఎన్నికల తర్వాత ఆమె ఇంతమంది ముందు ప్రసంగం ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మిషెల్ మాట్లాడుతూ ప్రథమ మహిళగా ఎనిమిదేళ్లు తాను చేసిన సేవ, అందుకొన్న విజయాల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు కానీ ఇప్పటికీ తన చర్మ రంగు గురించి తక్కువ చేసి చూస్తున్నవారు కోకొల్లలని విషెల్ వ్యాఖ్యానించారు. తాను ఎదుర్కొన్న జాతి వివక్ష విషయాలు చాలా బాధించాయని తెలిపారు. ఒరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మిషెల్ ఈ విషయాలేవీ వెల్లడించలేదు. కానీ ఈ ప్రసంగంలో మాత్రం నిర్మొహమాటంగా తాను ఎదుర్కొన్న జాతివివక్ష గురించి వెల్లడించారు.













