డొనాల్డ్ ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం
అమెరికా దిగువ సభలోని మైనారిటీ మహిళా సభ్యులపై దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నా అమెరికా కాదు, నీ అమెరికా కాదు.. మన అమెరికా అంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ట్విట్టర్ వేదికగా ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. ఈ దేశాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబెట్టేది ఇక్కడి వైవిధ్యం. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ అందాన్ని చూస్తున్నాను. మనం ఇక్కడ పుట్టిన వారమే కావచ్చు లేదంటే వలస వచ్చిన వారికే కావచ్చు. కానీ, ప్రతి ఒక్కరికి ఈ నేల నివాసయోగ్యం. మనం ఒక్క విషయం తప్పక గుర్తుకు పెట్టుకోవాలి. అమెరికా నీదో, నాదో కాదు. మన అమెరికా అని మెలానియా రాసుకొచ్చారు.













