అమెరికన్ వాణిజ్య తనిఖీదారులను తమ దేశంలోకి అనుమతించం
అమెరికన్ వాణిజ్య తనిఖీదారులను తమ దేశంలోనికి ఎన్నడూ అనుమతించబోమని మెక్సికో తేల్చి చెప్పింది. ఈ చర్య అమెరికా, కెనడాలతో ఇటీవల కుదుర్చుకున్న యూఎస్ఎంసీఏ ఒప్పందానికి భిన్నమైనదేమీ కాదన్నారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్థానంలో యూఎస్ ఎంసీఏను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లితిజర్ను కలుసుకునేందుకు మెక్సికో వాణిజ్య ప్రతినిధి జీసస్ సీదే వాషింగ్టన్కు బయల్దేరి వెళ్లారు. మెక్సికో విదేశాంగ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్న సీదె మీడియాతో మాట్లాడుతూ ఇతర దేశాలకు చెందిన రహస్య ఇన్స్పెక్టర్లను దేశంలో ప్రవేశానికి అనుమతించరాదని మెక్సికో చట్టం సృష్టంగా చెబుతోందన్నారు. దేశ సార్వభౌమత్వ సూత్రాలకు విరుద్ధంగా విదేశీ ఇన్స్పెక్టర్లను పంపడాన్ని తాము ఎంతమాత్రం అనుమతించేది లేదన్నారు.













