డొనాల్డ్ ట్రంప్ ను ప్రేమిస్తున్నా : మెలానియా ట్రంప్
భర్త డొనాల్డ్ ట్రంప్‌ను ప్రేమిస్తున్నానని, తమ పెళ్లి బంధంపై మీడియాలో వస్తున్న ఆరోపణలను అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతలో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలు ఏవీ కూడా తన దృష్టిని మరల్చడం లేదంటూ మెలానియా అన్నారు. తాను ఫోకస్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని ఆమె అన్నారు. తన వివాహ బంధంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మెలానియా తెలిపారు. డొనాల్డ్‌ను లవ్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆమె అవునని బదులిచ్చారు. మేం ఇద్దరం బాగానే ఉన్నామన్నారు. తానో తల్లిని అని, ఫస్ట్ లేడీ అని, తన ముందు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయన్నారు. ఏది తప్పు, ఏది తప్పు కాదో తనకు తెలుసన్నారు. అయితే వివాహేతర సంబంధాలు తనకేమీ లేవని కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తనతో ట్రంప్ శృంగారంలో పాల్గొన్నాడని ఫోర్న్ సటార్ స్టార్మీ డానియల్స్, ప్లేబాయ్ మోడల్ కేరన్ మెక్డుగల్ గతంలో ఆరోపించారు.













