మెహుల్ చోక్సి అమెరికాలో లేడు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సిలు ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నారా? అంటూ గల్లిగల్లి వెతుకున్నారు. వారిద్దరిన్నీ పట్టుకోవడానికి ప్రతి ఒక్క దేశం భారత్కు సాయపడుతోంది. తమ దేశంలో ఏమైనా నక్కి ఉన్నారేమోనని వెతుకులాట చేపట్టిన ఇంటర్ పోల్ వాషింగ్టన్, మెహుల్ చోక్సి తమ దేశంలో లేడంటూ క్లారిటీ ఇచ్చింది. గత వారం భారత్ పంపిన అభ్యర్థనకు ఇంటర్పోల్ వాషింగ్టన్ స్పందించింది. మెహుల్ చోక్సి అమెరికాలో లేడని తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే వెంటనే ఇంటర్పోల్ వాషింగ్టన్కు భారత్ మరో లేఖ పంపింది. చోక్సి ఆచూకి గురించి ఏమైనా తెలిస్తే తమకు అందజేయాలని కోరింది.













