అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రచార విరాళాల సేకరణ ఆసక్తికరం…
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రస్తుతం ప్రపంచమంతా దృష్టి సారించి ఉంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో అధ్యక్ష అభ్యర్థులు తమ ప్రచారం కోసం విరాళాలు ఎలా సేకరిస్తారన్న విషయం చాలామందికి తెలియదు. సంపన్నుల విరాళాలు పక్కన పెట్టి సాధారణ పౌరుల నుంచి కూడా వారు చాలా మర్యాదగా విరాళాలను సేకరిస్తుంటారు. ఓ చిన్న ఉత్తరం ద్వారా మీ నుంచి వారు విరాళాలను కోరుతారు. అదీకూడా మీకు ఎంతో గౌరవం ఇచ్చి అడుగుతారు. మిమ్మల్ని మేము విఐపిగా గుర్తించాలని భావిస్తున్నాము. మీరు మా ప్రచార సభకు విఐపిగా ఉండాలనుకుంటే మీరు విరాళం ఇచ్చి నిర్వహించే డ్రా ద్వారా సెలెక్ట్ అయితే మీరు అధ్యక్ష అభ్యర్థితో కూడా ఫోటోలు దిగవచ్చని చెబుతారు. ప్రచారానికి అవసరమైన విరాళం కోసం ట్రంప్ తరపున వాళ్ళ అబ్బాయి తెలుగుటైమ్స్ ఎడిటర్‌కు రాసిన ఉత్తరాన్ని ఇక్కడ చూడవచ్చు.














