బోస్టన్ లో మాజీ మంత్రి దేవినేని ఉమ మీటింగ్…150 మందికిపైగా హాజరు
అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు బోస్టన్ వెళ్లారు. ఎన్నారై టీడీపీ బోస్టన్ విభాగం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరై అభిమానులు, సానుభూతిపరులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా టీడీపి అభిమానులు విచ్చేసి అన్న ఎన్టీఆర్, విజనరీ లీడర్ చంద్రబాబు, కృషీవలుడు ఉమపై తమ అచంచలమైన అభిమానాన్ని చాటారు.
ఆంధ్ర అభివృద్ధి కోసం ఐదు సంవత్సరాల పాటు అవిశ్రాంతిగా తెలుగు దేశం ప్రభుత్వం చేసిన కృషిని సభ్యులకు మాజీ మంత్రి వివరించారు. ఎన్నారైలు కూడా తమ నియోజకవర్గాలలో బూత్ లెవెలో ఓటర్ వెరిఫికేషన్ చేయంచాలని, స్వింగ్ ఓటర్లను ప్రభావితం చేసేలా ఇప్పటి నుంచే క్రమపద్ధతిలో కార్యాచరణ చేయ్యలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నారైటీడీపీ.కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ.. వారం వారం పోలవరం అంటూ ఆంధ్రాలోని ప్రతి సీమకు నీరు అందించాలని పట్టుబట్టి పట్టి సీమను పూర్తి చేసి, పోలవరం పూర్తికై పరుగులు పెట్టించిన ఆంద్రా భగీరథుడు దేవినేని ఉమామహేశ్వర్రావు అని కొనియాడారు. దేవినేని సన్మానించాలని తమ్ముళ్లు సంకల్పించారు. అయితే, ఆయన నాకు కాదు ఇక్కడకు విచ్చేసిన 83 సంవత్సరాల పెద్దమ్మను మనం సన్మానించాలని అందరిని దగ్గరికి పిలిచి ఒక అమ్మను గౌరవ సత్కారం చేశారు.













