పూర్ణమాలావత్ను సత్కరించిన ఆటా
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో న్యూజెర్సిలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మాలావత్ను ఘనంగా సత్కరించారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని సౌత్ బ్రన్స్విక్ నగరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో పూర్ణమాలావత్ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంను నిర్వహించారు.
తొలుత విలాస్ జంబుల అందరికీ స్వాగతం పలుకుతూ, పూర్ణమాలావత్ను సభకు పరిచయం చేయగా, ప్రవీణ్ ఆలా, రవీందర్ గూడూరు, విజయ నాదెళ్ల పూర్ణ మాలావత్ సాధించిన విజయాలను తెలిపారు.
ఆటా జాయింట్ సెక్రటరీ శరత్ వేముల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్ణ మాలావత్ తమ జిల్లా నిజామాబాద్ నుంచి రావడం తనకు ఎంతో గర్వకారణం అని తెలుపుతూ అంటార్కిటికా ఖండంలో అతిఎత్తైన పర్వతాల్లో ఒకటైన ‘మౌంట్ విన్సన్ మసిఫ్’ పర్వతాన్ని అధిరోహించడం గొప్ప విషయం అని తెలిపారు. ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడానికి ఆటా తరపున అవసరమైన సహాయ సహకారాలను కూడా అందిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ దార్గుల, విజయ్ కుందూరు, శ్రీకాంత్ గుడిపాటి, రామ్ వేముల తదితరులు పాల్గొన్నారు. ఆటా మహిళలు ఇందిరా దీక్షిత్, శిల్పి కుందూరు, నేహా, అర్చన వేముల, నందిని దార్గులా, మాధవి, విజయ అందరు కలిసి పూర్ణకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమం లో సుమారు 100 మంది పిల్లలు పాల్గొని వారు అడిగిన పలు ప్రశ్నలకి పూర్ణ మాలావత్ సమాధానాలు చెప్పారు. హేమ ప్యూర్ సంస్ధ నుండి చాల మంది పిల్లలు డెలావేర్, పెన్సిల్వేనియా, కనెక్టికట్ ఇతర రాష్ట్రాలనుండి వచ్చారు.
అంటార్కిటికా ఖండంలో అతిఎత్తైన పర్వతాల్లో ఒకటైన ‘మౌంట్ విన్సన్ మసిఫ్’ పర్వతాన్ని తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ డిసెంబర్ 26, 2019న అధిరోహించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన పూర్ణ 2014లో స్కూల్ లో చదువుకునే వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన ఘనతను సాధించింది. ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్ లోని ఎల్బ్రాస్, సౌత్ అమెరికాలోని అకోన్ కాగ్వా, ఓషినియా రిజియన్లోని కార్ట్స్ నెజ్ ను కూడా పూర్ణ ఎక్కారు. పర్వతాలు ఎక్కడంలో తనకు తనే సాటి. ఇప్పటివరకు మొత్తం ఆరు ఎత్తయిన పర్వతాలను ఎక్కింది. ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడమే మిగిలి ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి శ్రమించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలను నిర్వాహకులు తెలిపారు. శరత్ వేముల (ఆటా జాయింట్ సెక్రటరీ), ప్రవీణ్ ఆలా (ఆటా న్యూ జెర్సీ రీజినల్ కో-ఆర్డినేటర్), రవీందర్ గూడూరు (ఆటా రీజినల్ డైరెక్టర్), విలాస్ రెడ్డి జంబుల (సోషల్ మీడియా చైర్) ఆధ్వర్యములో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీం రెడ్డి, ఆటా ఎలెక్ట్-ప్రెసిడెంట్ భువనేష్ భుజాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరినీ అభినందించారు.
శరత్ వేముల (ఆటా జాయింట్ సెక్రటరీ ), బోర్డు అఫ్ ట్రస్టీస్ శ్రీనివాస్ దార్గుల, విజయ్ కుందూరు, శ్రీకాంత్ గుడిపాటి, వినోద్ కోడూరు, రఘువీర్ రెడ్డి, రీజినల్ అడ్విసోర్స్ (రమేష్ మాగంటి, మహీ సన్నప రెడ్డి, రాజ్ చిలుముల), రామ్ వేముల , రవి పట్ల, ఇందిరా శ్రీరామ్ (ఆటా మహిళా విభాగం చైర్ ), విజయ నాదెళ్ల (ఆటా న్యూ జెర్సీ మహిళా కో-ఆర్డినేటర్) వారి సహకారముతో ఈ కార్యక్రమం విజయవంతం అయింది.
ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ప్రెసిడెంట్ కష్ణారెడ్డి ఏనుగుల, సంతోష్ ,శ్రీకాంత్ తుమ్మల, విలాస్ జంబుల, ఓవర్సీస్ కాంగ్రెస్ ఇంచార్జి రాజేందర్ దిచపల్లి, కమ్యూనిటీ లీడర్స్ మహేందర్ ముసుగు, రమేష్, ెతెలుగు కళా సమితి నుండి సుధాకర్ ఉప్పల, రాచకుల్ల మధు, న్యూజెర్సీ తెలంగాణ నాయకులు రవి దాన్నెపెనేని, మహేష్ పొగాకు, కళాభారతి ప్రదీప్ సువర్ణ, గురు అల్లంపల్లి ఇతరులు పాల్గొన్నారు.













