బే ఏరియాలో జొన్నవిత్తులతో ఇష్టాగోష్టి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం వెస్ట్ టీం ఆధ్వర్యంలో బే ఏరియాలోని స్వాగత్ హోటల్లో ప్రముఖ కవి జొన్నవిత్తులతో ఏర్పాటు చేసిన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామాయణంలో శ్రీరాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలు, సీత పాత్రల ఔన్నత్యాన్ని వివరించారు. ప్రతి పాత్రని అలా మలిచిన వాల్మీకీ గొప్పతనాన్ని తెలియజేశారు. కొందరి కోరిక మేరకు పేరడి పాటలు, గురుశిష్యుల హాస్య సంభాషణలను కూడా వినిపించారు. ఈ కార్యక్రమంలో జయరామ్ కోమటి, సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, రజనీకాంత్ కాకర్ల, సుబ్బారావు చెన్నూరి, యశ్వంత్ కుదరవల్లి, రామ్తోట, భక్తబల్లా తదితరులు పాల్గొన్నారు.













