మెక్‌డొనాల్డ్ సీఈవోవై వేటు
అమెరికాకు చెందిన ఫాస్ట్‌పుడ్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ సంస్థ తమ కంపెనీ సీఈవో స్టీవ్ ఈస్టర్‌బ్రూక్‌ను విధుల నుంచి తొలగించింది. ఓ ఉద్యోగినితో ఆయన సన్నిహిత సంబంధం నెరిపారని.. సంస్థ సిద్ధాంతాలకు ఈ చర్యలు విరుద్ధమని.. అందుకే ఆయన విధుల నుంచి తప్పుకున్నట్లు మెక్‌డొనాల్డ్స్ సంస్థ పేర్కొంది. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో స్టీవ్ ఈస్టర్బ్రూక్ తాను ఉద్యోగినితో సన్నిహిత సంబంధం పెట్టుకున్నట్లు అంగీకరించారు. 2015 నుంచి బ్రూక్ మెక్‌డొనాల్డ్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఇటీవల మెక్‌డొనాల్డ్ యూఎస్ ప్రెసిడెంట్‌గా నియమితులైన క్రిస్ కెంప్జిన్స్కీ (51) కంపెనీ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.













