సైంటిస్టుల్లో భయం: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం
సెప్టెంబర్ 1ని తలచుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఖగోళవేత్తలలో కలవరం మొదలవుతుంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం అందరిలోనూ నెలకొంది. 4.4 కిమీ.ల విస్తీర్ణమంత పరిమాణంలో ఉన్న గ్రహశకలం ఒకటి భూమికి దగ్గరగా రావడమే ఈ భయానికి కారణం. ఆ గ్రహ శకలం కనుక భూమిని తాకితే ప్రళయ తప్పదని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 20 ఏళ్ల కిందటే నాసా శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇప్పటి వరకు భూమికి దగ్గరగా వచ్చిన గ్రహ శకలాల వల్ల ప్రమాదాలేవీ చోటు చేసుకోలేదు. అయితే, తాజా గ్రహశకలం పరిమాణంలో పెద్దదిగా ఉండటంతో ఆందోళన నెలకొంది. 2013లో 20 మీటర్ల గ్రహశకలంతో విధ్వంసం తప్పదని భావించారు. గ్రహశకలం పరిమాణం ఒక కిమీలు దాటితే ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంటుంది. నాసా ఇప్పటి వరకు 880 గ్రహశకలాలు భూమికి సమీపంలో ఉన్నట్లు గుర్తించింది. అయితే, మరో 500 ఏళ్ల వరకు భూమికి ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నా, తాజా గ్రహశకలం స్థితిపై మాత్రం సరైన అంచనాకు రావటం లేదు. ప్రస్తుతం ఇది భూమికి 7 మిలియన్ కిమీల దూరంలో ఉంది. ఆగస్టు నెలాఖరి నుంచి ఈ గ్రహశకలాన్ని టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు













