ఆమె దేశాన్ని ఎలా నడపాలో మనకు నేర్పుతుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిన్నిసోటా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఇల్హాన్ అబ్దుల్లాహీ ఒమర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఒమర్ సొంత సోదరుడ్ని పెళ్లి చేసుకుందని, చట్ట విరుద్ధంగా అమెరికాలోకి అడుగుపెట్టిందని ఆరోపించారు. ఒమర్‌పై అమెరికా న్యాయ వ్యవస్థ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో భాగంగా ట్రంప్ ఒకాలా, ఫ్లోరిడాలో పర్యటించారు. తన ప్రత్యర్థి సోమాలియాలో పుట్టిందని, ఈ కారణంగా మిన్నిసోటాలో తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆమె మన దేశాన్ని ద్వేషిస్తుంది. అసలు ప్రభుత్వమే లేని దేశం నుంచి వచ్చి, మన దేశాన్ని ఎలా నడపాలో మనకు నేర్పుతుందా? తను నిజంగా ఓ అద్భుతమైన మహిళ అంటూ ఎద్దేవా చేశారు.













