జుకర్బర్గ్ తన సతీమణి ప్రిస్కిలా కు… అపూర్వ కానుక
టెక్ దిగ్గజం, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ తన సతీమణి ప్రిస్కిలా చాన్ పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఆమెకో అపూర్వ కానుకను బహూకరించారు. రోమన్ సంప్రదాయంలో ప్రిస్కిలా చాన్ విగ్రహాన్ని రూపొందించి ఇంటి పెరట్లో ఆవిష్కరించారు. నీలి రంగులో వెండి వస్త్రం పరిచినట్టుగా దానిని తీర్చిదిద్దారు. ఆ భారీ విగ్రహం పక్కన ఆమె నిల్చొని ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. భార్య విగ్రహాన్ని చెక్కే రోమన్ సంస్కృతిని తిరిగి తీసుకొచ్చాం. దాని రూపకర్త డేనియల్ అర్షమ్కు కృతజ్ఞతలు తెలిపారు. 2003లో హార్వర్డ్ యూనివర్సిటీలో మొదటిసారి కలుసుకున్న జుకర్బర్గ్, ప్రిస్కిలా చాన్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. వారిపేర్లు మ్యాక్సిమా, ఆగస్టు, అరేలియా.







