జాగ్రత్తలు తీసుకోలేకపోయాం… క్షమించండి
ఫేస్బుక్కు చెందిన 8.7 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయినందుకు తనను క్షమించాలని ఈ సంస్థ అధినేత మార్క్ జుకర్బర్గ్ అమెరికా చట్టసభను కోరారు. కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణానికి పూర్తిగా తనదే బాధ్యత అని అంగీకరించారు. డేటా దుర్వినియోగం కాకుండా ఫేస్బుక్ కానీ, సంస్థ సభ్యులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. తమ బాధ్యతకు సంబంధించి తగినంత విస్తృత దృక్పథాన్ని ఏర్పరుచుకోలేకపోయామని, ఇది పొరపాటేనని లిఖితపూర్వకంగా తెలిపారు. అమెరికా చట్టసభకు సంబంధించిన మరో రెండు కమిటీల ముందు జుకర్బర్గ్ హాజరు కానున్నారు.













