డొనాల్డ్ ట్రంప్ తో ఎలాంటి డీల్ లేదు
సామాజిక మాధ్యమమైన ఫేస్బుక్లో ప్రచారమవుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోకపోవడంపై ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఇటీవల విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుకార్లపై యాక్సియాస్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జుకర్‌బర్గ్ స్పందించారు. ట్రంప్‌తో ఫేస్బుక్ ఎటువంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. నేను కూడా ఈ పుకార్ల గురించి విన్నాను. ట్రంప్‌తో ఏ విధమైన ఢీల్ లేదని సృష్టం చేయదలచుకున్నాను అని పేర్కొన్నారు.













