అమెరికా చర్చిలో కాల్పులు
అమెరికాలోని టెక్సాస్ లోని విల్సన్ కంట్రీలోని సదర్ ల్యాండ్ లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో 26 మందిని బలిగొన్న కాల్పుల ఘటన మర్చిపోకముందే న్యూయార్క్ లోని ఈస్ట్ టెన్నిసీలోని యునైటెడ్ మెథడిస్ట్ చర్చిలో చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరికీ తుపాకీ తూటా గాయాలయ్యాయి. దాని వివరాల్లోకి వెళ్తే ఈస్ట్ టెన్నెసీ చర్చిలో థాంక్స్ గివింగ్ విందును ఏర్పాటు చేశారు. ఈ థాంక్స్ గివింగ్ విందుకు సుమారు 20 మంది సీనియర్ సిటిజన్స్ హాజరయ్యారు. ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న కాల్పుల్లో బలైనవారికి సంతాపం తెలిపిన తరువాత, అదే చర్చికి చెందిన పెద్దాయన (81) తన వెంట తెచ్చుకున్నా 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్ గన్ ను ఓపెన్ చేసి, మ్యాగజైన్ లోడ్ చేసి ఎలా వినియోగించాలో వారికి వివరించారు. దానిని అలాగే పక్కన పెట్టారు. ఈ సందర్భంగా నవ్వుతూ గడిపారు. ఇంతలో మరొక సభ్యుడు తనకు చూపించాలని అడుగుతూ ట్రిగ్గర్ నొక్కాడు. అంతే క్షణాల్లో అంతవరకు తుపాకీ ఎలా వాడాలో చూపించిన పెద్దాయన అరచేతిలోంచి దూసుకెళ్లిన బుల్టెట్, పక్కనే కుర్చిలో కూర్చున్న అతని భార్య (80) పొట్ట, ముంజేతిలోకి దూసుకెళ్లింది. దీంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కావడంతో ఎవరిమీద కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.













