NATS: నాట్స్ వేదికపై డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి ఘనసత్కారం
టాంపా బే ఏరియాలో జరుగుతున్న నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి ఘనసత్కారం జరిగింది. తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన గోపీచంద్.. ఈ ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్‌తో ‘జాట్’ చిత్రంతో హిందీలో డైరెక్టర్‌గా అరంగేట్రం చేశారు. ఈ సినిమా అదిరిపోయే లాభాలతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలా తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్తున్న ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పినమనేని, టీపీ రావు, గంగాధర్, శ్యామ్ మద్దాలి, శేఖర్, విజయ్ తదితరులంతా కలిసి నాట్స్ వేదికపై సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గోపీచంద్.. నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విక్టరీ వెంకటేశ్ తదితరులముందు ఇలా సత్కారం పొందడం చాలా గౌరవంగా ఫీలవుతున్నానన్నారు. బాలకృష్ణతో తను తీసే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు. అలాగే నాట్స్ సభ్యులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.







