మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో రక్త దాన శిబిరం
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో రక్త దాన శిబిరం నేషనల్ బ్లడ్ సెంటర్ మలేషియా లో విజయవంతముగా నిర్వహించారు. మహత్మా గాంధీ 150వ జన్మదిన సంబరాలలో భాగంగా ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సహకారముతో దాదాపు 50 మంది మైట సభ్యులతో విజయవంతంగా నిర్వహించామని మైట అధ్యక్షుడు సైదం తిరుపతి తెలియజేసారు. ఈ శిబిరంలో పాల్గొన్న దాతలందరికి వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి మరియు జనరల్ సెక్రటరీ రవి చంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి జనరల్ సెక్రటరీ రవి చంద్ర,ముఖ్య కార్యవర్గ సభ్యులు కార్తీక్, సందీప్, మారుతి, రవివర్మ, చందు, వెంకటేశ్వర్లు, సత్య, నరేందర్, అశ్విత, చిట్టి బాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.













