టెక్సాస్, జార్జియా రాష్ట్రాల లో లాక్ డౌన్ సడలింపు పై వెనక్కితగ్గాలి అని అధికారులు హెచ్చరిక
అమెరికాలో కొత్త కరోనావైరస్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి, దక్షిణ అమెరికా మరియు పశ్చిమ అమెరికా దేశాలలో మరింత గ కరోనావైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది, మరోవైపు జాతీయస్థాయిలో రోజువారీ కరోనావైరస్తో మరణించిన సంఖ్య రెట్టింపుఅవుతున్నాయి. ఈ సమయంలో పున ప్రారంభాల పై పునఃఅలోచనలు చేసుకోవాలి అన్ని రెండు రాష్ట్రాల్లోని అధికారులు హెచ్చరించారు.
అమెరికా దేశం లో కరోనా కేసుల సంఖ్య శుక్రవారం. 8 జులై మొదటిసారి 60,000 కు చేరుకుంది, చివరికి ఈ సంఖ్య 68,000కి పైగా పెరిగాయి. గడిచిన 11 రోజుల్లో ఏడుసార్లు కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది అంతే కాకా అమెరికాలో ఆరు రాష్ట్రాలు జార్జియా, అయోవా, మోంటానా, నార్త్ కరోలినా, ఒహియో మరియు ఉటా కొత్త కరోనా కేసుల నమోదు చైయటంలో రికార్డులో నిలిచాయి:
ఇది ఇలావుండగా మరో ఎనిమిది రాష్ట్రాల లో ( అలబామా, అరిజోనా, ఫ్లోరిడా, మిసిసిపీ, నార్త్ కరోలినా, సౌత్ డకోటా, టెక్సాస్ మరియు టేనస్సీ ) ఈ వారంలో ఒకే రోజు కరోనావైరస్ బారినపడి మరణించిన వాళ్ళ సంఖ్యతో రికార్డులు సృష్టించాయి: . ఈ నెల ప్రారంభంలో అమెరికాలో కరోనావల్ల మరణాల సగటు వారానికి 471 లో ఉండగా,శుక్రవారం, 8 జులై నాటికీ 642 కి చేరుకున్నట్టు తెలుస్తోంది.ఈ వారంలో నాలుగుసార్లు రోజువారీ కొత్త కరోనా కేసుల నమోదులో రికార్డు సంఖ్యను నివేదించిన టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బోట్ మాట్లాడుతూ ఒకవేళ కేసు పెరుగుదలను రాష్ట్రం నియంత్రించలేకపోతే కొత్త ఆర్థిక లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉంది అని అన్నారు.
శుక్రవారం, 8 జులై తేదికి 4,000 కి పైగా కొత్త కేసులను జార్జియా లో నమోదు అయిన కారణంగా అట్లాంటా అధికారులు ఫేజ్ 1- ( అంటే నివాసితులు ఎక్కువగా ఇంట్లో ఉండాలిసిన పరిస్థితి ) మార్గదర్శకాలని తిరిగి అనుసరించడానికి అట్లాంటా అధికారులు సిద్ధమవుతున్నారని మరియు ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నందున అట్లాంటాలోని ఒక కన్వెన్షన్ సెంటర్ను తాత్కాలిక వైద్య కేంద్రంగా మారుస్తున్నట్లు గవర్నర్ బ్రియాన్ కెంప్ చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో టెక్సాస్, జార్జియా రాష్ట్రలో పునఃప్రారంభాలపై ఆలోచించాలి అని రాష్ట్ర అధికారులు హెచ్చరించారు.













