సీఎం కెసిఆర్ మరియు కేటీఆర్ లకు అభినందనలు తెలిపిన మహేష్ బిగాల
తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ – మహేష్ బిగాల అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూజెర్సీ, అట్లాంటా, సౌత్ అమెరికా లోని పెరూ, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్ ల పర్యటన లో భాగంగా తెలంగాణ ఎన్నారై లను ముఖాముఖీ కలుసుకున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో, ఎన్నారై శాఖకు 100 కోట్లు కేటాయించడాన్ని ఎన్నారై లు స్వాగతించారు. విదేశీ పర్యటనలో భాగంగా పలు దేశాల తెరాస శాఖల అధ్యక్షులు, పలువురు ఇతర ఎన్నారై ల నుండి మహేష్ బిగాల అభిప్రాయ సేకరణ జరిపారు. ఇటీవల స్వదేశం చేరుకున్న మహేష్ బిగాల, నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ఎన్నారై ల అందరి తరపున ప్రత్యేక హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నారై మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపి ఎన్నారై లు ఏమి కోరుకుంటున్నారో వివరించారు. ఎన్నారై విధి విధానాలకు సంబంధించిన అభిప్రాయాలను అలాగె, మొదటి ప్రాధాన్యత గల్ఫ్ కోసం ఇవ్వాలని కోరారు.













