డల్లాస్ లో ‘మా’ వేడుకలు
అమెరికాలో నిర్వహించనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో భాగంగా తొలి వేడుకకు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. డల్లాస్‌లో తొలి వేడుకను నిర్వహిస్తున్నట్టు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు. ”మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటై 25 యేళ్లు పూర్తయిన సందఠంగా నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకలకి పరిశ్రమలోని అగ్ర కథానాయకులు చక్కటి సహకారం అందిస్తున్నారు. వేడుకల గురించి చెప్పగానే ఎక్కడికి రావడానికైనా సిద్ధంగా ఉన్నానని, ఏప్రిల్ 28న డల్లాస్‌లో జరిగే తొలి వేడుకకు హాజరవుతానని చిరంజీవి చెప్పారు. మహేష్‌బాబు మేలో జరిగే వేడుకకి వచ్చేందుకు అంగీకారం తెలిపారు. ‘మా’ ప్రధాన కార్యదర్శి నరేష్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యుడు సురేష్, ఈవెంట్ ఆర్గనైజర్లు రాధాక ష రాజా, స్టీఫెన్ పల్లామ్, రాంబాబు కల్లూరి, నిఖిల్ నాంచారితో పాటు బెనర్జీ, సురేష్ కొండేటి, ఉత్తేజ్, నాగినీడు, సురేష్, అనితా చౌదరి తదితరులు ఈ వేడుకల గురించి తెలిపారు.













