లుపిన్ లాభాలకు అమెరికా గండి
అమెరికా మార్కెట్లో అమ్మకాలు క్షీణించడంతో దేశీయ ఫార్మా కంపెనీ లుపిన్ రెండో త్రైమాసిక లాభాలకు గండి పడింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.3,890.9 కోట్ల కన్సాలిడేటెడ్ అమ్మకాలపై రూ.266 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా తగ్గినా నికర లాభం 41.5 శాతం పడిపోయింది. అమెరికా, కెనడాతో కలిపి ఉత్తర అమెరికా మార్కెట్లో కంపెనీ అమ్మకాలు 8.25 శాతం తగ్గి రూ.1,248.7 కోట్లకు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఫారెక్స్ మార్కెట్, అమెరికా మార్కెట్లు ప్రస్తుతం స్థిరపడుతున్నందున మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నీలేశ్ గుప్తా చెప్పారు.













