లివర్మోర్ టెంపుల్ లో 14 నుంచి పురుషసూక్త యాగం, రజత ద్వార స్థాపన
కాలిఫోర్నియాలో ఉన్న లివర్మోర్లోని శివ విష్ణు టెంపుల్లో ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు పురుషసూక్త యాగం నిర్వహిస్తున్నారు. 14 గురువారం ఉదయం 9 నుంచి ఈ యాగం ప్రారంభమై ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. విశ్వశాంతి కోసం నిర్వహించే ఈ యాగంలో భక్తులంతా పాల్గొనాలని ఆలయ పాలకవర్గం కోరుతోంది.
వేదాలలో పురుషసూక్తానికి ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యత ఉన్న ఈ పురుషసూక్త యాగంలో భాగస్వాములయ్యేవారికి వారి మనోభీష్టాన్ని బట్టి కోరికలు నెరవేరుతాయని అంటారు. పెళ్ళికాని వాళ్ళకు పెళ్లి అవుతుందని, సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని, కరవుపీడిత ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని అలాగే అనారోగ్యం బారిన పడినవారికి రోగాలు నయమవుతాయని చెబుతారు. ఈ యాగంలో అందరూ పాల్గొని ఆ దేవదేవుని కటాక్షం పొందాలని పాలకవర్గం కోరుతోంది.
రజత ద్వార స్థాపన
ఆలయంలో శివ విష్ణు దేవాలయాలకు వెండివాకిలి ద్వార సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 3.30 నుంచి 6.30 వరకు ఈ వెండివాకిలి సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది.
ఇతర కార్యక్రమాల వివరాలు
ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 9 నుంచి 12 వరకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, భగవత్ ప్రార్థన, పంచగవ్య ప్రస్నం, అకల్మష హోమం జరుగుతుంది. సాయంత్రం 5 నుంచి 7 వరకు అనుగ్న, యాగశాల వాస్తు, దీక్ష ప్రదానం, ్జఅజస్రం భూమి పూజ, అంకురార్పణం, మృత్సంగ్రహణం, వాస్తు హోమం, నైవేద్యం, హారతి కార్యక్రమాలు జరుగుతాయి.
ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాల ద్వారపూజ ధ్వజస్థాపన – ప్రవేశం, కుంభ ఆవాహనం, అగ్నిప్రతిష్టాపనం, పంచగవ్య అధివాసం, పురుషసూక్త హోమం 1వ కలశం, శాత్తుమురై, నైవేద్యం, హారతి జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పురుషసూక్త హోమం 2వ కలశం, జల అధివాసం, శాత్తుమురై, నైవేద్యం, హారతి జరుగుతుంది.
ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పురుషసూక్త హోమం 3వ కలశం, క్షీర అధివాసం, శాత్తుమురై, నైవేద్యం, హారతి జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు బాలాజీ, శ్రీరామ, శ్రీ కృష్ణ మూర్తులకు అభిషేక ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం 5 నుంచి 8 వరకు పురుషసూక్త హోమం 4వ కలశం, శాత్తుమురై, నైవేద్యం, హారతి జరుగుతుంది.
ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. 8.30కు యాగశాల పూజ, 9 గంటలకు పురుషసూక్త హోమం 5వ కలశం, 11.30కు మహాపూర్ణాహుతి, 12.30కు కుంభ ప్రోక్షణ జరుగుతాయి. మధ్యాహ్నం?3.30 నుంచి 6.30 వరకు శివ విష్ణు రజత ద్వార సంప్రోక్షణ జరుగుతుంది. మధ్యాహ్నం 3.30కు వాస్తుహోమం, 4 గంటలకు తిరువీధి ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు శివ, విష్ణు రజత ద్వారస్థాపన జరుగుతుంది.
ఇతర వివరాల కోసం ఆలయ వెబ్సైట్ను చూడండి.
https://livermoretemple.org/hints/purusha-sukta-yagam/index.html#home













